Uttar Pradesh cop | బైక్ పై ప్రమాదకర స్టంట్స్.. పోలీస్ కు షాకిచ్చిన ఉన్నతాధికారులు
Uttar Pradesh cop | యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన ఓ పోలీసే నిబంధనలను అతిక్రమించాడు. బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ చిక్కుల్లో పడ్డాడు.
Uttar Pradesh cop | యువతకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన ఓ పోలీసే నిబంధనలను అతిక్రమించాడు. బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్ పూర్ లో చోటు చేసుకుంది.
సందీప్ కుమార్ చౌబే (Sandeep Kumar Chaubey) గోరఖ్ పూర్ (Gorakhpur)లో కానిస్టేబుల్ (Constable)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, యూనిఫాం ధరించి బైక్ పై ప్రమాదకర స్టంట్స్ (bike stunts) చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. వీడియో లో ‘నీకు శత్రువులంటే భయం లేదా?’ అని ఒక అమ్మాయి అడగ్గా.. ‘శత్రువులు అంటే భయం ఎందుకు?. చావు అంటే ఏంటి?.. ఈరోజు కాకపోతే రేపైనా మనం చనిపోతాం. భయపడాలంటే దేవుడికి భయపడండి. కీటకాలు, స్పైడర్లకు ఎందుకు భయపడతారు?’ అని సదరు కానిస్టేబుల్ జవాబిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది కాస్తా ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో అధికారులు సదరు కానిస్టేబుల్ పై వేటు వేశారు.
పోలీసులు తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దన్న నిబంధనలు ఉన్నాయి. ఈ మేరకు ఈ ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి 8) ఉత్తర్వులు జారీ అయ్యాయి కూడా. అయినప్పటికీ సదరు కానిస్టేబుల్ రీల్స్ చేయడంతోపాటు అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఉత్తర్వులను ఉల్లంఘించిన సందీప్ చౌబేపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
Also Read..
Yogi Adityanath | జ్ఞానవాపి మసీదుపై యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
Tourist Plane | సముద్రంలో ల్యాండ్ అయిన టూరిస్ట్ విమానం.. ప్రయాణికులు సేఫ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

