Priyanka Chaturvedi | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గానికి చెందిన శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi)పై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ (Sanjay Shirsat) అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందాన్ని చూసే ఆమెకు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) రాజ్యసభలో స్థానం కల్పించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది స్పందించారు. ‘నేను ఎలా ఉన్నానో.. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మరోవైపు ఆదిత్య ఠాక్రే సైతం స్పందించారు. ‘ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉన్న వారు రాజకీయాల్లో ఎలా ఉన్నారో నాకు తెలియడం లేదు’ అని మండిపడ్డారు.
मी कशी दिसते आणि मी जिथे आहे तिथे का आहे हे मला एका गद्दार व्यक्तीने सांगायची गरज नाही, ज्याने 50 खोक्यांसाठी आपला आत्मा आणि प्रामाणिकपणा विकला.
संजय शिरसाट हे राजकारण आणि महिलांबद्दलच्या त्यांच्या विचारांमधील व्यापक आजाराचे एक उत्तम उदाहरण आहे, ते त्यांच्या टिप्पण्यांमधून…
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 30, 2023
Also Read..
Parliament Sessions | కుదిపేస్తున్న మణిపూర్ అంశం.. ఉభయసభల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..
Zelensky | ఇప్పుడు యుద్ధం రష్యావైపు మళ్లింది : మాస్కోపై డ్రోన్ దాడి తర్వాత జెలెన్ స్కీ వ్యాఖ్య