Tourist Plane | విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తితే.. పైలట్లు దగ్గర్లోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. అయితే, ఫ్రాన్స్ (France) లో మాత్రం ఓ పైలట్ తన విమానాన్ని ఏకంగా సముద్రంలో దించారు (Sea Landing). విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో విమానం నీటిలో మునిగిపోయినప్పటికీ.. అందులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
దక్షిణ ఫ్రాన్స్ లోని ఫ్రెజెస్ (Frejus) తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పైలట్ తోపాటు ఇద్దరు ప్రయాణికులతో ఓ చిన్నపాటి పర్యాటకుల విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఇంజిన్ ఫెయిల్ (Engine Breakdown) అయింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దగ్గర్లో విమానాశ్రయం లేకపోవడంతో పైలట్ విమానాన్ని సమీపంలోని బీచ్ వద్ద ల్యాండ్ చేయాలనుకున్నాడు. అయితే, అక్కడి సందర్శకుల భద్రత నేపథ్యంలో బీచ్ కు 600 మీటర్ల దూరంలో సముద్రంలోనే విమానాన్ని కిందకి దించాడు. విమానం సముద్రంలో ల్యాండ్ కావడంతో బీచ్ రెస్క్యూ బృందం అప్రమత్తమైంది. వెంటనే బోట్లలో అక్కడికి చేరుకుని ముగ్గురినీ రక్షించి, ఒడ్డుకు చేర్చింది. విమానం మాత్రం సముద్రంలో మునిగిపోయింది.
Also Read..
Tomatoes | రూ.21లక్షల విలువైన టమాటా లోడ్ లారీ మిస్సింగ్..
Zelensky | ఇప్పుడు యుద్ధం రష్యావైపు మళ్లింది : మాస్కోపై డ్రోన్ దాడి తర్వాత జెలెన్ స్కీ వ్యాఖ్య