యూపీఎస్సీ నూతన చైర్‌పర్సన్‌గా మాజీ ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్న ఆమె గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటివరకు యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మనోజ్ సోని ఈనెల 4న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా 2025 ఏప్రిల్ 29 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు సుదాన్ ఈ పదవిలో కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సుదాన్ పలు హోదాలలో పనిచేశారు. 2020 జూలై వరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా ఉన్నారు. యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఒక మహిళను నియమించడం ఇది రెండోసారి. అంతకుముందు 1996లో చైర్‌పర్సన్‌గా ఆర్ఎం బాథ్యూ వ్యవహరించారు.