న్యూఢిల్లీ: యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు upsc.gov.in లేదా upsconline.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలను తెలుసుకోవచ్చు. 14,161 మంది ఆగస్టు 22న జరిగే మెయిన్స్‌కు అర్హత సాధించారు.
మెయిన్స్ పరీక్షలో వ్యాస రచన, జీఎస్ పేపర్లు ఉంటాయి. 979 ఉద్యోగాల కోసం మే 25న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.