న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2026లో నిర్వహించే వివిధ పోటీ పరీక్షల క్యాలెండర్ను శుక్రవారం విడుదల చేసింది. దాని ప్రకారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ప్రిలిమినరీ 2026 మే 24న జరుగుతుంది. సీఎస్ఈ మెయిన్స్ పరీక్ష ఆగస్ట్ 21న జరుగుతుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 12న జరుగుతాయి.
ఈ పరీక్షల సెకండ్ సెషన్ 2026 సెప్టెంబరు 13న నిర్వహిస్తారు. యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్ష 2026 జూలై 19న జరుగుతుంది.
సీఎస్ఈ ప్రిలిమ్స్, 2025 అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాల్లో ప్రవేశానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి.