BJP | బీజేపీలో అగ్ర కులాలకే అందలం.. 17 మంది సీఎంలలో 10 మంది వారే
ఒకప్పుడు బీజేపీ బ్రాహ్మణ మద్దతు కలిగిన పార్టీగా ఉండేది. అయితే ఓబీసీ నేత అయిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ పార్టీని వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీలు, ఇతర వర్గాలపై పట్టు సాధించి అందరినీ కలుపుకుని పోయే పార్టీగా మార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వివిధ రాష్ర్టాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలతో పాటు పార్టీ శ్రేణుల్లోని ఉన్నత పదవులు అగ్ర కుల నేతలే ఆక్రమిస్తున్నారు.
- 17 మంది సీఎంలలో 10 మంది వారే
- నితిన్ నబీన్ బృందంలోనూ అదే తీరు
- ప్రధాన కార్యదర్శుల్లో ఆరుగురు.. ఉపాధ్యక్షులలో ఏడుగురు వాళ్లే
న్యూఢిల్లీ: ఒకప్పుడు బీజేపీ బ్రాహ్మణ మద్దతు కలిగిన పార్టీగా ఉండేది. అయితే ఓబీసీ నేత అయిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ పార్టీని వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీలు, ఇతర వర్గాలపై పట్టు సాధించి అందరినీ కలుపుకుని పోయే పార్టీగా మార్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వివిధ రాష్ర్టాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలతో పాటు పార్టీ శ్రేణుల్లోని ఉన్నత పదవులు అగ్ర కుల నేతలే ఆక్రమిస్తున్నారు.
‘ది ప్రింట్’ విశ్లేషణ ప్రకారం ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు (కాయస్థ వర్గం) నియమించిన నూతన ఆఫీస్ బేరర్లలో 50 శాతానికిపైగా అగ్ర కులానికి చెందినవారే ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని 17 మంది ముఖ్యమంత్రుల్లో 10 మంది అగ్రకులాలు లేదా అగ్రవర్గాలకు చెందిన వారు కాగా, ముగ్గురు ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), ముగ్గురు షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) ఒకరు మెయిటీ వర్గానికి చెందినవారున్నారు. హిమంత బిశ్వ శర్మ(అస్సాం), రేఖా గుప్తా(ఢిల్లీ) ప్రమోద్ సావంత్(గోవా), భూపేంద్ర పటేల్(గుజరాత్), దేవేంద్ర ఫడ్నవిస్(మహారాష్ట్ర), భజన్లాల్ శర్మ(రాజస్థాన్), మాణిక్ సాహా(త్రిపుర), యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్) పుష్కర్ సింగ్ ధామి(ఉత్తరాఖండ్) సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్) అగ్రకులానికి చెందినవారు.
పెమాఖండూ (అరుణాచల్ ప్రదేశ్), విష్ణదేవ్ సాయి(ఛత్తీస్గఢ్), మోహన్ చరణ్ మాఝీ(ఒడిశా) ఎస్టీ కేటగిరీకి చెందినవారు కాగా, సామ్రాట్ చౌదరి(బిహార్) నాయబ్ సింగ్ సైనీ(హర్యానా) మోహన్ యాదవ్(మధ్యప్రదేశ్) ఓబీసీ వర్గానికి చెందినవారు. బీజేపీ కొత్తగా నియమించిన ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఆరుగురు అగ్ర కులాలకు చెందినవారే. 13 మంది జాతీయ ఉపాధ్యక్షులలో ఏడుగురు అగ్ర కులాలకు చెందినవారు కాగా, ఇద్దరు ఓబీసీలు, ఒకరు ఎస్టీ, ఒకరు ఎస్పీ, ఒకరు ముస్లిం, మరొకరు సిక్కు వర్గానికి చెందినవారు. కాగా కొత్త బృందం సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు ‘ది ప్రింట్’కు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

