
లక్నో: ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌జెండర్ లీడర్ సోనమ్, ఆ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ చైర్‌పర్సన్‌గా బుధవారం నియమితులయ్యారు. రాష్ట్ర మంత్రి హోదా కూడా పొందారు. ఈ సందర్భంగా మీడియాతో సోనమ్ మాట్లాడారు. వచ్చే ఏడాది జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన జీవితంలో ఎన్నటికీ అధికారంలోకి రాలేడని, ఇది తన శాపమని సోనమ్ అన్నారు.