ఎవరు వీళ్లంతా..ఎందుకీ తోపులాట అనుకుంటున్నారా? యూపీలో ఈమధ్యనే పంచాయతీ ఎలక్షన్స్ ముగిశాయి. ఈరోజే కౌంటింగ్ మొదలు కానుండటంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఇలా పోలింగ్ ఏజెంట్లు ఎగబడ్డారు. ఓవైపు కోవిడ్ తో ఉత్తరప్రదేశ్ లో కూడా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఫిరోజాబాద్ పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ఏజెంట్లు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు క్యూ పద్ధతిని పాటించారు. అన్నీ పత్రాలు వెరిఫై చేసిన తర్వాతనే ఏజెంట్లను ఒక్కొక్కరిని బూత్ లోపలికి అనుమతించారు.
#WATCH | Counting agents queue up outside a polling centre in Firozabad. Counting for #UPPanchayatElection2021 is undeway. Visuals from this morning. pic.twitter.com/VQVU7PrlX7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 2, 2021