Judge’s son threatens cops | నో పార్కింగ్ ప్లేస్‌లో జడ్జి కుమారుడి కారు.. చెంపపై కొడతానంటూ పోలీసులకు బెదిరింపు
Judge's son threatens cops | ఒక జడ్జి కుమారుడు నో పార్కింగ్ ప్లేస్‌లో కారు నిలిపాడు. ట్రాఫిక్ పోలీసులు దీనిని నిలదీయగా చెంపపై కొడతానంటూ వారిని బెదరించారు (Judge's son threatens cops). అయితే ఒత్తిడికి లొంగని ట్రాఫిక్ పోలీసులు ఆ కారును అక్కడి నుంచి లాక్కెళ్లారు.
లక్నో: ఒక జడ్జి కుమారుడు నో పార్కింగ్ ప్లేస్‌లో కారు నిలిపాడు. ట్రాఫిక్ పోలీసులు దీనిని నిలదీయగా చెంపపై కొడతానంటూ వారిని బెదరించారు (Judge’s son threatens cops). అయితే ఒత్తిడికి లొంగని ట్రాఫిక్ పోలీసులు ఆ కారును అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. జిల్లా జడ్జీ కుమారుడు శనివారం హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని నో పార్కింగ్ జోన్లో కారు పార్క్ చేశాడు. అయితే నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలుపడంపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒక కారు నో పార్కింగ్ ప్రాంతంలో ఉండటాన్ని చూశారు. ఆ కారు యజమాని ఎవరంటూ మైక్‌లో ఎనౌన్స్ చేశారు. ఎవరూ రాకపోవడంతో ఆ కారును నో పార్కింగ్ జోన్ నుంచి పక్కకు లాక్కెల్లారు.
కాగా, ఇంతలో జడ్జి కుమారుడు అక్కడకు వచ్చాడు. పార్కింగ్ చేసిన చోట తన కారు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రాఫిక్ పోలీసులు తన కారును లాక్కెళ్లడంపై అరిచి గోల చేశాడు. తన కారును విడిచిపెట్టకపోతే వారికి బుద్ధి చెబుతానని, జైలుకు పంపుతానని, చెంపపై కొడతానంటూ బెదిరించాడు.
మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎంతకీ వెనక్కి తగ్గలేదు. దీంతో కొంత సేపటి తర్వాత ఆ జడ్జి కుమారుడు రూ.1,100 జరిమానా చెల్లించాడు. ఈ నేపథ్యంలో మీరట్ ప్రిన్సిపల్ జడ్జి పేరు మీద రిజిస్టర్ అయిన ఆ కారును రిలీజ్ చేశారు. కాగా, జడ్జి కుమారుడు ట్రాఫిక్ పోలీసులను బెదిరించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడిపై చర్యలు చేపట్టాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు.
In Lucknow, the son of a judge threatened traffic police for towing away his car from a no-parking zone. Thankfully, police didn't succumb to pressure. Hope CJI is watching this "entitlement of the unelected" anonymously on Twitter and takes cognizance.pic.twitter.com/Y5BxhpovGh
— THE SKIN DOCTOR (@theskindoctor13) August 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

