Viral video : అతనొక వైద్యుడు (Doctor). పైగా ఎమర్జెన్సీ విభాగం (Emergency unit) లో విధులు. విధి నిర్వహణలో భాగంగా రోగులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అతడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కాబోయే భార్య (Fiancee) తో కలిసి ఆస్పత్రి గదిలో డ్యాన్స్ (Dance) చేశాడు. అయితే ఆ గదిలోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వీడియోలు వైరల్ కావడంతో డాక్టర్ ఉద్యోగం ఊడిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ వకార్ సిద్ధిఖీ షామ్లీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రెండేళ్ల కాంట్రాక్టు ప్రాదిపదికన ఉద్యోగంలో చేరాడు. ఎమర్జెన్సీ విభాగంలో అతనికి బాధ్యతలు అప్పగించారు. ఉండటానికి ఆస్పత్రిపైనే ఒక గది ఇచ్చారు. అయితే ఆ డాక్టర్ ఇటీవల తనకు కాబోయే భార్యను గదికి తీసుకొచ్చి డ్యాన్స్ చేశాడు.
ఆ గదిలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. దాంతో దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై వివరణ ఇవ్వాలని డాక్టర్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అతడు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అతడికి ఇచ్చిన గదిని ఖాళీ చేయించారు.
यूपी –
शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV
— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025