మీరట్, మార్చి 5 : ‘ప్రతి రోజూ నా భార్య కలలోకి వచ్చి నా గుండెలపై కూర్చుని నన్ను చంపడానికి రక్తం తాగేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ పీడకలలతో నిద్రపట్టక రోజూ ఆఫీస్‌కు ఆలస్యంగా వస్తున్నాను’ అంటూ అధికారులకు ఒక కానిస్టేబుల్ ఇచ్చిన సంజాయిషీ పత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. యూపీలోని మీరట్‌లో ప్రొవెన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి విధులకు ఆలస్యంగా రావడంతో నోటీస్ ఇచ్చారు. వైవాహిక సమస్యల కారణంగా నిద్రలేమితో బాధపడుతున్నానని, ప్రతి రోజూ తన భార్య కలలోకి వస్తూ నన్ను చంపుతానంటూ బెదిరిస్తున్నదని తెలిపాడు.