లక్నో, ఆగస్టు 7: సోషల్ మీడియా కళ్లెం లేని గుర్రంలా తయారైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ముహూర్తం కోసం వేచిచూడకుండా వెంటనే దాన్ని అదుపు చేయాలని బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కార్యకర్తలకు సూచించారు. యూపీలో ఓ స్థానిక ఘటనపై విదేశాల్లో సోషల్ మీడియాలో విచారణ ప్రారంభించారన్న ఓ విశ్లేషణను ఆయన ఉదహరించారు. ప్రింట్, టీవీ మీడియాకు యజమానులు, సంపాదకులు ఉంటారని, సోషల్ మీడియాను నియంత్రించడానికి ఎవరూ ఉండరని చెప్పారు. అప్రమత్తంగా లేకపోతే దాని బారినపడతారని హెచ్చరించారు.