హింసాత్మక నిరసనల్లో పాల్గొంటే నో జాబ్
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
లక్నో : ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. హింసాత్మక నిరసనల్లో పాల్గొని ప్రభత్వాన్ని మార్చడానికి ప్రయత్నించే వారిని, అలాంటి సంస్థల్లో సభ్యత్వం ఉన్న వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా గుర్తిస్తామని చెప్పింది. ఈ మేరకు అభ్యర్థుల క్యారెక్టర్ వెరిఫికేషన్‌లో కీలక సవరణలు చేసింది.
అభ్యర్థికి 21ఏండ్లు నిండిన తర్వాత అతని గత మూడేండ్ల ప్రవర్తనపై వెరిఫికేషన్ చేస్తారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇచ్చే సంస్థల్లో సభ్యత్వం ఉన్నా, అలాంటి నిరసనల్లో పాల్గొన్నా అతన్ని అనర్హుడిగా ప్రకటిస్తారు. వివిధ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థల్లో నేరుగా భర్తీ చేసే కొలువులపై ఈ ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

