University of Hyderabad | ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో.. హైదరాబాద్ యూనివర్సిటీకి చోటు
University of Hyderabad | ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ చోటు దక్కించుకున్నది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 801-850 ర్యాంకుల మధ్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిలిచింది.
హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ (University of Hyderabad) చోటు దక్కించుకున్నది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఎనలిస్ట్ క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్ విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 801-850 ర్యాంకుల మధ్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిలిచింది. మొత్తం 8467 విద్యా సంస్థలను ఈ సంస్థ అధ్యయనం చేసింది. భారత్‌లోని 54 యూనివర్సిటీలతో సహా 106 ప్రాంతాల్లోని 1501 విద్యా సంస్థల ప్రమాణాలను పరిశీలించింది.
కాగా, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ఎడిషన్‌లో ‘సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ’ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 335వ ర్యాంక్ సాధించినందుకు తాము సంతోషిస్తున్నట్లు హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు తెలిపారు. రెండు విభిన్న డేటాసెట్లను క్యూఎస్ సేకరిస్తుందని చెప్పారు. అలాగే విద్యా సంస్థల స్థిరత్వం, ఉపాధి అవకాశాల ఫలితాలు, అంతర్జాతీయ పరిశోధన నెట్వర్క్, విద్యతోపాటు యజమాన్యం ఖ్యాతి, అధ్యాపక విద్యార్థి నిష్పత్తి వంటి వాటిని గ్లోబల్ ర్యాంకులకు కొలమానంగా పరిగణిస్తారని వెల్లడించారు.
Also Read:
Calf Born With 2 Heads | రెండు తలలు, మూడు కళ్ళతో జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడిన జనం
Watch: కేదార్నాథ్ యాత్రికుల మధ్య తీవ్ర ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

