ఢిల్లీ, సెప్టెంబర్ 28: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు రైతులే కాదని, పంజాబ్ నుంచి కొందరు అన్నదాతల ముసుగులో వచ్చి ఆందోళన ప్రారంభించారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంతోపాటు హర్యా నా ప్రభుత్వాన్ని కూల్చడమే వారి లక్ష్యమని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. హర్యానా సీఎంగా ఖట్టర్ ఉన్నంతవరకు అక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అర్థమైందని, అం దుకే ఆయనను సీఎం పదవి నుం చి తొలగించిందని ఎద్దేవా చేశారు.