న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తెలిపారు. అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో చర్చించిన తర్వాత సమయాన్ని వెల్లడించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశం రాజకీయ పార్టీల కాదు అని, కానీ యువత భవిష్యత్తుకు చెందుతుందని అన్నారు. అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. నీట్ లీకేజీపై బయట మాట్లాడిన ప్రధాని, పార్లమెంట్లో ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదని అఖిలేశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా పేపర్ లీకేజీ అంశాన్ని లోక్సభలో లేవనెత్తారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులో సభలో హంగామా చేశారు. చర్చకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి రిజిజు చెప్పారని ఓం బిర్లా గుర్తు చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేశారు.
#WATCH | Delhi: Parliamentary Affairs Minister Kiren Rijiju says, “The government stated in Parliament today that it is fully prepared to discuss the NEET exam paper leak and all related matters. We have stated from day one that the government is always ready to discuss any issue… pic.twitter.com/XrsxPEuNyj
— ANI (@ANI) July 22, 2026