రైల్వేకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు.. 25వేల కోట్లతో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ

న్యూఢిల్లీ: రైల్వేశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది. రైల్వేశాఖ కోసం ప్రత్యేకంగా 5 మెగాహెట్జ్ 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించారు. ఇవాళ కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ, 5జీ స్పెక్ట్రమ్ అమలు కోసం రానున్న అయిదేళ్లలో 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 5 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను రైల్వే శాఖకు 700 MHz బ్యాండ్‌లో కేటాయించనున్నారు. దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడమే కాకుండా రైలు ప్రయాణాలు మరింత సురక్షితం అవుతాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రైల్వేశాఖ ఆప్టికల్ ఫైబర్‌ను మాత్రమే వినియోగిస్తోందన్నారు. స్పెక్ట్రమ్ అందుబాటులోకి రావడం వల్ల రేడియో కమ్యూనికేషన్ కూడా రైల్వేశాఖ వాడే వీలుంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

