న్యూఢిల్లీ: ప్రపంచ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెం బ్లీ శుక్రవారం ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక దేశం అమెరికా. ఈ నిర్ణయం దేశాలు లేదా ఖం డాల వాస్తవ వైశాల్యాన్ని ప్రభావితం చేయదు. ఇది కేవలం పటంలో అవి ఎంత పెద్దవిగా లేదా చిన్నవిగా కనిపిస్తాయనే అంశాన్ని మాత్రమే మారుస్తుంది.ఈ కొత్త మ్యాప్‌ను ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అని పిలుస్తారు. ఈ విధానంలో ఆఫ్రికా గణనీయంగా పెద్దదిగా కనిపిస్తుంది. అదే సమయంలో ఐరోపా, ఉత్తర అమెరికా చిన్నవిగా కనిపిస్తాయి.