అయోధ్య, జనవరి 22: రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న హిందూత్వ నాయకురాళ్లు ఉమాభారతి, సాధ్వీ రితంబర సోమవారం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని కండ్లరా చూసి భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ఎన్నో ఏండ్ల హిందువుల కల సాకారమైందని సంతో షం వ్యక్తం చేశారు. ఆలయం ముందు వారిద్దరూ ఉద్విగ్నంగా కనిపించారు.