Uddhav Thackeray | మా పార్టీలో చేరండి ఎంపీగా గెలిపించుకుంటాం : నితిన్ గడ్కరీకి ఉద్ధవ్ ఠాక్రే ఆఫర్
Uddhav Thackeray : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాషాయ పార్టీని వీడాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరోసారి కోరారు. బీజేపీలో తనకు అవమానం జరిగితే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు.
Uddhav Thackeray : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాషాయ పార్టీని వీడాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరోసారి కోరారు. బీజేపీలో తనకు అవమానం జరిగితే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి నితిన్ గడ్కరీ విజయం సాధించేలా విపక్షం సహకరిస్తుందని అన్నారు.
యావత్మాల్ జిల్లా పుసాద్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఠాక్రే మాట్లాడుతూ గతంలో బీజేపీ టార్గెట్ చేసిన మాజీ కాంగ్రెస్ నేత కృపాశంకర్ సింగ్ పేరు సైతం పార్టీ తొలి జాబితాలో ఉన్నా గడ్కరీ పేరు మాత్రం గల్లంతైందని, బీజేపీ గడ్కరీని అవమానించిందని ఆరోపించారు. బీజేపీలో మీకు అవమానం ఎదురైతే మహా వికాస్ అఘడి (సేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్)లో చేరాలని తాను గతంలో గడ్కరీని కోరానని, మళ్లీ అదే విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.
గడ్కరీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేలా తాము చూసుకుంటామని ఠాక్రే స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే గడ్కరీకి మంత్రి పదవి ఇస్తామని పేర్కొన్నారు. కాగా, గడ్కరీపై ఠాక్రే వ్యాఖ్యల పట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. వీధిలో ఓ వ్యక్తి ఒకరిని అమెరికా అధ్యక్షుడిని చేస్తానని అన్నట్టు ఠాక్రే వ్యాఖ్యలున్నాయని ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. గడ్కరీ బీజేపీలో ప్రముఖ నేతని, అయితే మహారాష్ట్రలో బీజేపీ, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు ముగియకపోవడంతో రాష్ట్రం నుంచి ఎవరి పేర్లు తొలి జాబితాలో లేవని తెలిపారు.
Read More :
Vitamin-D | 90% మంది మహిళల్లో విటమిన్-డీ లోపం.. అపోలో, హార్లిక్స్ అధ్యయనంలో వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

