watch: గుర్రంపై వచ్చి హుండీ చోరికి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Men On Horse Try To Steal Temple Donation Box | గుర్రంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక ఆలయం వద్ద ఉన్న హుండీని చోరీ చేసేందుకు ప్రయత్నించారు. (Men On Horse Try To Steal Temple Donation Box) అయితే వీధి కుక్కలు మొరగడంతో స్థానికులు మేల్కొన్నారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: గుర్రంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక ఆలయం వద్ద ఉన్న హుండీని చోరీ చేసేందుకు ప్రయత్నించారు. (Men On Horse Try To Steal Temple Donation Box) అయితే వీధి కుక్కలు మొరగడంతో స్థానికులు మేల్కొన్నారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 20న అర్ధరాత్రి వేళ బార్రా ప్రాంతంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు ఇద్దరు వ్యక్తులు గుర్రంపై వచ్చారు. ఒక వ్యక్తి గుర్రంపై ఉండగా మరో వ్యక్తి గుడి హుండీని పగులగొట్టి డబ్బులు చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
కాగా, ఈ వ్యక్తులను చూసి అక్కడున్న వీధి కుక్కలు మొరిగాయి. దీంతో కొందరు స్థానికులు నిద్ర నుంచి మేల్కొన్నారు. గుడి హుండీ చోరీకి ప్రయత్నించిన దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారు గుర్రంపై అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
उक्त वीडियो का संज्ञान लेकर थाना बर्रा पुलिस द्वारा जांच की जा रही है, सम्बन्धित के द्वारा तहरीर दिये जाने पर आवश्यक कार्यवाही की जायेगी।
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) December 24, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Horse
- men
- steal
- Temple Donation Box
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

