Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు. జిల్లాలోని బెజ్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం డీఆర్జీ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆపరేషన్ పార్టీకి మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మృతులను గొల్లపల్లి ఎస్ఓఎస్ కమాండర్ మద్కమ్ ఎర్రా (Madkam Erra), ఆయన భార్యగా పొడియం భీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై రూ.8 లక్షలు రివార్డు ఉండగా, ఆయన సతీమణిపై రూ.3 లక్షల రివార్డు ఉన్నదని తెలిపారు.
ఘటపా స్థలంలో ఆయుధాలు, పెద్దమొత్తంలో ఐఈడీలు, ఆటోమేటిక్ వెపన్స్, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నది. ఆదివారం ఉదయం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని చర్ల మండలంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

