Ujjains Mahakal Temple | ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయంలో సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన ఇద్దరు మహిళా సిబ్బందిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో గల ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయం ఎంతో పవిత్రమైందిగా పేరు గాంచింది. అయితే, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు.. ఆలయంలో డ్యాన్స్ చేశారు. నల్ల డ్రెస్లు ధరించి.. బాలీవుడ్ పాటలు ‘ప్యార్ ప్యార్ కర్తే కర్తే’, ‘జీనే కే బహనే లకోన్’కు కాలు కదిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అధికారులు.. ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులపై చర్యలకు ఉపక్రమించారు. వారిద్దరినీ వెంటనే విధుల నుంచి తొలగించారు.
महाकाल मंदिर में फिल्मी गाने पर दो महिला सुरक्षाकर्मियों के डांस करने का वीडियो सामने आया है. #JanhitTimes #ujjainmahakaltemple #Temple #viralvideo #madhyapradesh pic.twitter.com/HwVELfJ2x7
— Janhit Times (@janhit_times) December 5, 2022