రాంచీ : ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై గ్రామస్తులు దాడి చేశారు. అంతే కాకుండా వారికి నిప్పంటించారు. దీంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సదార్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఇద్దరు యువకులు బుధవారం రాత్రి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు యువకులది పక్క గ్రామం. అయితే తన పట్ల జరిగిన లైంగికదాడిని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మైనర్ పేరెంట్స్, స్థానికులు కలిసి పక్క గ్రామంలోకి యువకులిద్దర్నీ పట్టుకున్నారు.
అనంతరం బాధితురాలి గ్రామానికి తీసుకొచ్చి దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. ఆగ్రహాంతో ఊగిపోయిన గ్రామస్తులు.. యువకులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి బైక్‌ను కూడా తగులబెట్టారు. అయితే ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.