ముంచుకొస్తున్న జంట తుఫానులు
దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు ముంచుకొస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుఫాన్, బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
- అరేబియా సముద్రంలో తేజ్, బంగాళాఖాతంలో హమూన్
- భారత వాతావరణ విభాగం వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు ముంచుకొస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుఫాన్, బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తేజ్ తుపాన్ ఆదివారం తీవ్ర తుఫానుగా మారి యెమెన్-ఒమన్ తీరాల వైపు పయనిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.
ఈ తుఫాన్ వాయువ్య దిశగా కదిలి, ఆల్గైదా (యెమెన్), సలాలా (ఒమెన్) మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరరేఖకు ఇరువైపులా ఒకేసారి రెండు తుఫానులు సంభవించడం చాలా అరుదని వాతావరణ నిపుణులు తెలిపారు. చివరి సారిగా 2018లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.
హమూన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా కదులుతున్నది. మరి కొన్ని గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, కేరళ, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం
ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోనూ రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

