Train | రైలులో హనీమూన్ సెటప్ వైరల్.. అసలు కథ బయటపడడంతో టీటీఈపై సస్పెన్షన్ వేటు
Train | సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీ రైలు బోగీని హనీమూన్ సూట్‌లా అలంకరించి కొత్త జంటకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేశాయి. బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డులతో అలంకరించిన రైలు క్యాబిన్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు.
Train | సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీ రైలు బోగీని హనీమూన్ సూట్‌లా అలంకరించి కొత్త జంటకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేశాయి. బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, “ఐ లవ్ యూ” బోర్డులతో అలంకరించిన రైలు క్యాబిన్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు రైల్వే భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఘటనపై తాజాగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 6న బల్లార్షా–ముంబై నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పెద్ద చర్చకు దారి తీసింది.
వివరాల ప్రకారం, జల్నాకు చెందిన ఓ నూతన వధూవరుల కోసం రైల్లోని ఏసీ కూపేను ముందుగానే బుక్ చేశారు. అదే సమయంలో ‘రహత్ రూమ్ డెకరేషన్’ అనే ఈవెంట్ డెకరేషన్ సంస్థకు చెందిన సిబ్బంది రైలులోకి వెళ్లి క్యాబిన్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. కొత్త దంపతులు ఔరంగాబాద్ నుంచి కారులో జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రైలులో ప్రయాణం ప్రారంభించారు.నూతన దంపతుల తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఆన్లైన్ ద్వారా డెకరేషన్ సేవలను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రైలు క్యాబిన్‌ను హనీమూన్ సూట్‌ను తలపించేలా తీర్చిదిద్దడంతో ఆ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అనుమతి లేకుండా బయటి వ్యక్తులు రైలులోకి ఎలా ప్రవేశించారు? భద్రతా నిబంధనలు ఎలా ఉల్లంఘించబడ్డాయి? అనే ప్రశ్నలు తలెత్తాయి. విషయం రైల్వే మంత్రిత్వశాఖ దృష్టికి చేరడంతో అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బయటి వ్యక్తులను అనుమతి లేకుండా రైలులోకి అనుమతించడం, ప్రయాణికుల కంపార్ట్మెంట్లో భారీగా అలంకరణలు చేయడం రైల్వే నిబంధనలకు విరుద్ధమని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలతో సంబంధిత టీటీఈ గిరీష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కొత్త దంపతులు తమ తొలి ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం చివరకు రైల్వే అధికారులకు తలనొప్పిగా మారింది.
“Balloon, Roses .. I love you” 😳
A couple travelling on Train No. 11002 Nandigram Express turned First AC cabin imto ‘honeymoon suite’
They had hired a private decorator online to decorate their 1st AC coupe.
BIG ACTION 🚨 The Ticket Checker has been suspended, and a… pic.twitter.com/q5VJ0UqNxC
— News Algebra (@NewsAlgebraIND) July 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

