TTD | మే 3 నుంచి ఢిల్లీలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
TTD Brahmotsavam | టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీ(Delhi)లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 3వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభం కానున్నాయని ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.
TTD Brahmotsavam| టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీ(Delhi)లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 3వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభం కానున్నాయని ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఉత్సవాలు మే 3న అంకురార్పణతో ప్రారంభమై, 13న పుష్పయాగంతో ముగుస్తాయని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.
మే 8న స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించి ఢిల్లీలో ఏపీ(AP),తెలంగాణ (Telangana), కర్ణాటక (Karnataka),తమిళనాడు (Tamilnadu) భవన్ లలో సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. యమున ఘాట్(Yamuna Ghat)లో చక్రస్నానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఆలయ ఆవరణలో నిర్మించిన యాగశాలను మే 8న ప్రారంభిస్తామన్నారు. కొవిడ్(Covid) కారణంగా ఢిల్లీలోని ఏపీ భవన్లో తొలగించిన టీటీడీ సమాచార కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ చైర్మన్, ఈవోతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. జమ్ములో నిర్మిస్తున్న టీటీడీ ఆలయం జూన్ నాటికి పూర్తకావస్తుందన్నారు.
జూన్ 3 నుంచి కుంభాభిషేకం ప్రారంభమవుతుందని ,జూన్ 8న విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

