Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sabarimala: శబరిమల గుడికి తీసుకెళ్లాల్సిన నెయ్యిని మరో చోటుకు తరలించిన కేసులో కేరళ విజిలెన్స్ శాఖ ట్రాన్స్‌పోర్టు కాంగ్రాక్టర్ బిన్నును అరెస్టు చేసింది. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి సుమారు 11000 లీటర్ల ఒరిజినల్ మిల్మా బ్రాండ్ నెయ్యిని తమిళనాడుకు తరలించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
తిరువనంతపురం: కేరళలోని శబరిమల(Sabarimala) ఆలయానికి చెందిన నెయ్యిని అక్రమంగా తరలించిన కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ ఎస్ఎస్ బిన్నును అరెస్టు చేశారు. సుమారు 11000 లీటర్ల మిల్మా బ్రాండ్ నెయ్యి స్థానంలో నాణ్యత లేని నెయ్యిని శబరిమల ఆలయానికి తరలించినట్లు బిన్నుపై ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల ఆలయానికి సుమారు రెండున్న కోట్ల నష్టం వచ్చినట్లు ట్రావెన్‌కోరు దేవస్థానం బోర్డు పేర్కొన్నది. 2025 సీజన్ కోసం శబరిమలకు నెయ్యిని ట్రాన్స్‌పోర్టు చేయాలని బిన్నుకు కాంట్రాక్టు అప్పగించారు. అయితే అతను మిల్మా బ్రాండ్ నెయ్యికి బదులుగా చౌక నెయ్యిని ఆలయానికి తరలించాడు.ఆ కేసులో తొలి అరెస్టు జరిగింది.
కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం విజిలెన్స్ శాఖ ఈ అరెస్టు చేసింది. శుక్రవారం ఆ కేసులో వీఏసీబీ బృందం బిన్నును ప్రశ్నించింది. అరవన ప్రసాదం తయారీ కోసం పాతనంమిట్ట మిల్మా బ్రాండ్ నెయ్యిని దేవస్థానం వాడాలనుకున్నది. ఆ కాంట్రాక్టును బిన్నుకు ఇచ్చింది. అయితే శబరిమలకు చెందిన ఒరిజినల్ నెయ్యిని తమిళనాడులో రెండు ఏజెన్సీలకు బిన్ను మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నెయ్యి స్థానంలో నాణత్యలేని నెయ్యిని దేవస్థానికి సరఫరా చేసినట్లు కేసు నమోదు అయ్యింది. డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నకిలీ ఇన్వాయిస్లను బిన్ను సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

