Heart Attack | డీజే సౌండ్‌కు వరుడికి గుండెపోటు.. స్జేజ్పైనే మృత్యువ్యాత
Heart Attack | బీహార్‌లో ఓ పెళ్లింట విషాదం నెలకొన్నది. డీజే సౌండ్ మోతకు వరుడి గుండె లయ తప్పింది. స్టేజిపైనే గుండెపోటు రావడంతో అతడు అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. ఈ సంఘటన సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచేసుకొన్నది.
Heart Attack | పాట్నా, మార్చి 4: బీహార్‌లో ఓ పెళ్లింట విషాదం నెలకొన్నది. డీజే సౌండ్ మోతకు వరుడి గుండె లయ తప్పింది. స్టేజిపైనే గుండెపోటు రావడంతో అతడు అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. ఈ సంఘటన సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళితే, సురేంద్రకుమార్ (22) అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో పెండ్లి జరుగుతున్నది. వరుడు సురేంద్రకుమార్ స్టేజిపైకి రాగా, వధూవరులు దండలు మార్చుకొన్నారు. అదే సమయంలో అతడి మిత్రులు డీజే సౌండ్‌ను పెంచి, నృత్యాలు చేస్తున్నారు. దీంతో ఇబ్బందికి గురైన వరుడు సౌండ్ తగ్గించాలని పదేపదే కోరాడు. కానీ, అతడి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటికే వరుడు సురేంద్రకుమార్ అక్కడే కుప్పకూలిపోగా, కుటుంబ సభ్యులు సమీప దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యుడు వరుడు మృతిచెందినట్టు నిర్ధారించాడు. పెండ్లి తర్వాత ఆనందోత్సాహాల నడుమ సురేంద్రకుమార్ బరాత్ జరుగాల్సిన రోజే శవయాత్ర నిర్వహించాల్సి రావడం అందరినీ కలిచివేసింది.
అధిక శబ్దాలతో వినికిడిలోపం, ఆందోళన
ప్రస్తుతకాలంలో వేడుక ఏదైనా డీజేల హవా నడుస్తున్నది. అత్యధిక శబ్ద తీవ్రతతో డీజేలు పెట్టుకొని ఎంజాయ్ చేయడం ట్రెండ్‌గా మారింది. అయితే, అధిక శబ్దాల వల్ల వినికిడి లోపంతోపాటు ఆందోళన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కేవలం శబ్దాలు వినిపించకపోవడంతోనే ఆగిపోవడంలేదని, మతిమరుపు, కుంగుబాటు, స్పృహ తప్పడంలాంటి ఇతరత్రా సమస్యలకూ దారితీస్తున్నదని చెప్తున్నారు. ఆందోళన తీవ్రతరమైతే గుండెపోటు వస్తుందని హెచ్చరిస్తున్నారు. బీహార్‌లో జరిగిన ఘటన ఇదే కోవకు చెందిందని చెప్తున్నారు.
శబ్దాల తీవ్రత నివాసప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబుల్, రాత్రి సమయంలో 45 డెసిబుల్‌కు మించకూడదని మార్గదర్శకాలు ఉన్నా.. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని బీహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ అశోక్‌కుమార్ ఘోష్ పేర్కొన్నారు. ఈ పరిమితి దాటితే ప్రజల్లో చెవితోపాటు గుండె, ఊపిరితిత్తులు, నిద్రలేమి సమస్యలు వస్తాయని చెప్పారు. ఈ విషయం చెప్పినా ప్రజలు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

