Bengaluru | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు దేశంలోనే మొదటి స్థానంలో.. ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత పుణెలో భారీగా ట్రాఫిక్ ఉంటున్నదని ఆమ్స్టర్డామ్ కేంద్రంగా పనిచేసే లొకేషన్ టెక్నాలజీ సంస్థ టోమ్టోమ్ వెల్లడించింది.
ప్రపంచంలోకెల్లా అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం లండన్ అని, ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటు సమయం 37 నిమిషాల 20 సెకండ్లు పడుతుందని పేర్కొన్నది. నివేదిక ప్రకారం బెంగళూరు, పుణెల్లో ఈ ప్రయాణ సమయం వరుసగా 28 నిమిషాల 10 సెకండ్లు, 27 నిమిషాల 50 సెకండ్లుగా ఉన్నది. అదేవిధంగా అత్యంత రద్దీ నగరాల్లో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ తర్వాత బెంగళూరు రెండో స్థానంలో ఉన్నది.