పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత ఈ చేపకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం.. మనిషి గోరు అంత ఉంటుంది. పక్కాగా చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు. మయన్మార్ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే.
శబ్దాల్ని చేయటంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్‌కు చెందిన చారైట్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ చేపలు140 డెసిబుల్స్ వరకు శబ్దం చేయగలవని, అంబులెన్స్ సైరన్, జాక్హ్యామర్ (డ్రిల్లింగ్ మిషన్) డ్రిల్లింగ్ శబ్దానికి ఇది సమానంగా ఉంటుందని చెప్పారు.