Tomato Prices | మళ్లీ టమాట మంట : సెంచరీ దాటి పరుగులు
టమాట మళ్లీ మంటెక్కింది. వంటింట్లో టమాట (Tomato Prices) లేనిదే పూట గడవకున్నా ధరల షాక్‌తో ఈ కూరగాయను మగువలు పక్కనపెట్టేస్తున్నారు
న్యూఢిల్లీ : టమాట మళ్లీ మంటెక్కింది. వంటింట్లో టమాట (Tomato Prices) లేనిదే పూట గడవకున్నా ధరల షాక్‌తో ఈ కూరగాయను మగువలు పక్కనపెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా ఏకంగా రూ. 100 దాటడంతో కొనేందుకు వినియోగదారులు వెనుకాడుతున్న పరిస్ధితి. హోల్‌సేల్ మార్కెట్లలో ధర పెరగడంతో రిటైల్ దుకాణాల్లో కిలో టమాట రూ. 80 నుంచి రూ. 120 వరకూ పలుకుతోంది.
అధిక ఉష్ణోగ్రతలతో పాటు రుతుపవనాల రాకలో జాప్యం కారణంగా దిగుబడులు తగ్గడంతో టమాట ధరలు మండుతున్నాయని రైతులు చెబుతున్నారు. నిత్యావసరంగా మారిన టమాట ధరలు కొండెక్కడంతో రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యూపీ, హర్యానాతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి సరఫరాలు తగ్గడంతో గత నాలుగైదు రోజుల్లోనే టమాట ధరులు రెట్టింపయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.
టమాట ధరల పెరుగుదల రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగుతుందని వ్యాపారులు బాంబు పేల్చారు. తాజా పంట మార్కెట్లలోకి వస్తేనే ధరల మంట నుంచి ఉపశమనం కలుగుతుందని హోల్‌సేలర్లు చెబుతున్నారు.
ఇక టమాట ధరలు భగ్గుమంటుడటంతో ఈ కూరగాయ లేకుండానే వంటలను సరిపెట్టేస్తున్నామని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు టమాట మంటెక్కడంతో ఇన్ఫ్లేషన్ గరిష్ట స్ధాయికి చేరుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More :
బరువు తగ్గేందుకు క్రాష్ డైట్ ఎంచుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే !
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

