బరువు తగ్గేందుకు క్రాష్ డైట్ ఎంచుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే !
తక్కువ సమయంలో గణనీయంగా బరువును తగ్గించే ఆహార విధానాన్ని ‘క్రాష్ డైటింగ్' అని పిలుస్తారు. ఇందులో రోజువారీగా తీసుకునే కెలోరీల సంఖ్య 700 నుంచి 900 వరకు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఎముకల మీద దుష్ప్రభావం పడుతుంది.
తక్కువ సమయంలో గణనీయంగా బరువును తగ్గించే ఆహార విధానాన్ని ‘క్రాష్ డైటింగ్’ అని పిలుస్తారు. ఇందులో రోజువారీగా తీసుకునే కెలోరీల సంఖ్య 700 నుంచి 900 వరకు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఎముకల మీద దుష్ప్రభావం పడుతుంది. శరీరంలోని ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుకుంటూనే, బరువు తగ్గించుకోవాలంటే రోజుకు గరిష్ఠంగా 1200 కెలోరీలు అవసరమవుతాయి. దీర్ఘకాలంలో రోజువారీ కెలోరీల విలువ ఇంతకంటే తక్కువ ఉంటే శారీరకంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా క్రాష్ డైట్ ఎంచుకునే వాళ్లు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎముకల బరువు, కండరాల నిర్మాణాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరిన్ని ఇబ్బందులూ తప్పవు.
అనేక సమస్యలు
బరువు తగ్గడానికి క్రాష్ డైట్ అనుసరించడం, గోళీలు వాడటం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి, గుండె సమస్యలకు దారితీసే అవకాశమూ ఉంది. శరీరంలో పోషకాల లోపం ఏర్పడవచ్చు. మెదడులో ఎండార్ఫిన్ల లాంటి రసాయనాల విడుదల తగ్గిపోవచ్చు. దీంతో కుంగుబాటు, చికాకు లాంటివి తలెత్తుతాయి. పోషకాలు తక్కువగా ఉన్న ఆహారాలు శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి లోపాలకు దారితీస్తాయి.
దీంతో ఎముకలు గుల్లబారడం, పగుళ్లు లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇక, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం శరీరంలో బలహీనత, మలబద్ధకం, డీహైడ్రేషన్, నోటి దుర్వాసన, కండరాలు పట్టేయడం, చక్కెర తినాలని బలంగా అనిపించడం.. లాంటి అవలక్షణాలకు అంటుకడుతుంది.
బరువు తగ్గడానికి అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటారు కొంతమంది. ఇది నడి వయసువారిలో గుండె వైఫల్యం ముప్పు పెంచుతుంది. అలానే, పూర్తిగా పండ్లే తినడమూ మంచిది కాదు. దీనివల్ల ఇతర పదార్థాల నుంచి అందాల్సిన పోషకాలు శరీరానికి దక్కకుండా పోతాయి. కాబట్టి, బరువు తగ్గే క్రమంలో.. ఎముకలను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. అలా శరీరానికి తగినంత క్యాల్షియం, విటమిన్-డి అందేలా జాగ్రత్తపడాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

