కేరళలో ‘టమాటా ఫ్లూ’ కలకలం
కేరళలోని పలు దక్షిణ జిల్లాల్లో ఇటీవల ‘టమాటా ఫ్లూ’ వైరస్ వెలుగుచూసింది. ఐదేండ్ల లోపు వయసున్న 80 మంది చిన్నారుల్లో ఈ వైరస్ను గుర్తించారు. చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం ఈ జ్వర ప్రత్యేక లక్షణం. డీహైడ్రేషన్, దగ్గు, జలుబు, డయేరియా వంటి లక్షణాలూ కనిపిస్తాయి
తిరువనంతపురం, మే 11: కేరళలోని పలు దక్షిణ జిల్లాల్లో ఇటీవల ‘టమాటా ఫ్లూ’ వైరస్ వెలుగుచూసింది. ఐదేండ్ల లోపు వయసున్న 80 మంది చిన్నారుల్లో ఈ వైరస్ను గుర్తించారు. చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం ఈ జ్వర ప్రత్యేక లక్షణం. డీహైడ్రేషన్, దగ్గు, జలుబు, డయేరియా వంటి లక్షణాలూ కనిపిస్తాయి. చర్మంపై టమాటా ఆకారంలో బొబ్బలు వస్తుండటంతో దీనికి టమాటా ఫ్లూ అని పేరు పెట్టారు.
ప్రసుత్తానికి ఆందోళనకర పరిస్థితులు లేకున్నా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, చర్మంపై బొబ్బలు వస్తే ఆశ్రద్ధ చేయవద్దని, ఫ్లూ బారిన పడిన వారికి దూరంగా ఉండటం వంటివి పాటించాలని సూచిస్తున్నారు. టమాటా ఫ్లూ నేపథ్యంలో కేరళ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో భాగంగా కేరళ-తమిళనాడుల సరిహద్దు పట్టణమైన వలయార్లో జ్వరం, దద్దుర్లు, ఇతర లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు పరీక్షలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kerala
- kids
- Tomato flu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

