న్యూఢిల్లీ: టోఫెల్ విద్యార్థుల అదనపు సాధన కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ‘టోఫెల్ టెస్ట్ రెడీ’ ప్లాట్‌ఫామ్‌ను ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థుల వ్యక్తిగత సాధనకు ఇది దోహదపడుతుందని, టిప్స్ రూపంలో సలహాలు, సూచనలు కూడా చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఫ్రీ, పెయిడ్ ఆఫర్లను ఉపయోగించుకొని ‘టోఫెల్ టెస్ట్ రెడీ’లో సాధన చేయవచ్చు. ‘ఏఐ ఆధారిత టెస్ట్ రెడీ విలక్షణ వేదిక. వ్యక్తిగత సాధనలో మెరుగులు దిద్దుకోవడానికి ఇదెంతగానో సహాయకారిగా నిలుస్తుంది’ అని
ఈటీఎస్కు చెందిన రోహిత్ శర్మ చెప్పారు.