Mamata Banerjee: ప్రాణం పోయినా సరే.. దేశాన్ని విడగొట్టనివ్వను : మమత
CM Mamata Banerjee: ఎన్ఆర్సీ చేపట్టాలని కేంద్రం చూస్తోందని, దాన్ని అడ్డుకుంటున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశ విభజనను నిరోధిస్తామన్నారు.
కోల్కతా: ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee).. కోల్కతాలోని రెడ్ రోడ్డులో ఉన్న మసీదుకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో శాంతి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తమకు హింస వద్దన్నారు. దేశంలో విభజన వద్దన్నారు. దేశాన్ని విభజించాలని కోరుకుంటున్నవారికి, ఈద్ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నానని, ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తానని, కానీ దేశాన్ని విభజన కానివ్వనన్నారు.
మీరంతా ప్రశాంతంగా ఉండాలని, ఎవరి మాటలు వినిపించుకోవద్దు అని, ఓ గద్దార్ పార్టీతో పోరాటం చేస్తున్నానని, కేంద్ర ఏజెన్సీలతోనూ ఫైట్ చేస్తున్నానని, తనలో ధైర్యం ఉంది కాబట్టి పోరాడుతున్నానని, కానీ తాను తల వంచేది లేదని దీదీ అన్నారు. బీజేపీ నుంచి కొందరు డబ్బులు తీసుకుని, ముస్లిం ఓట్లను చీల్చుతారని కొందరంటుంటారని, బీజేపీ కోసం ముస్లిం ఓట్లను చీల్చే ధైర్యం వాళ్లకు లేదని ఆమె అన్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉందని, ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరో తెలిసిపోతుందని ఆమె అన్నారు.
ఒకవేళ ప్రజాస్వామ్యం వెళ్లిపోతే, అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారని, ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేశారని, చరిత్రను మార్చేస్తున్నారని, వాళ్లు ఎన్ఆర్సీ తీసుకువచ్చారని, ఆ పని చేయనీయనని వాళ్లకు చెప్పినట్లు మమతా బెనర్జీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

