మంగళవారం 19 జనవరి 2021
National - Dec 31, 2020 , 01:53:33

ప్రచండతో అలిసిపోయా: ఓలీ

ప్రచండతో అలిసిపోయా: ఓలీ

కఠ్మండు: నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీలో చీలికలు రాకుండా ఉండేందుకు మాజీ ప్రధాని ప్రచండతో లెక్కలేనన్ని సంప్రదింపులు జరిపి అలిసిపోయానని ప్రధాని కేపీ శర్మ ఓలీ చెప్పారు. పలు ఒప్పందాలను ప్రచండ ఉల్లంఘించారని ఆరోపించారు. నేపాల్‌లో రాజకీయ అనిశ్చితిపై చైనాకు చెందిన దౌత్యవేత్తల కూటమి బుధవారం ఇరువురు నేతలతో చర్చలు జరిపింది. ఆ బృందం వెళ్లిన కొన్ని గంటల్లోనే ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు.