ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. అమీర్ ఖాన్ మొదటి లక్ష్యం
నటుడు టైగర్ ష్రాఫ్‌పై ఈ నెల 18న కాల్పులు జరిపిన నిందితులు మొదట నటుడు అమీర్ ఖాన్‌పై కాల్పులు జరపాలనుకొన్నారని ముంబై పోలీస్ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాయి. అయితే అతడిని లక్ష్యంగా చేసుకోవడం కష్టం కావడంతో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపారు.
ముంబై : నటుడు టైగర్ ష్రాఫ్‌పై ఈ నెల 18న కాల్పులు జరిపిన నిందితులు మొదట నటుడు అమీర్ ఖాన్‌పై కాల్పులు జరపాలనుకొన్నారని ముంబై పోలీస్ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాయి. అయితే అతడిని లక్ష్యంగా చేసుకోవడం కష్టం కావడంతో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపారు. అమీర్ ఖాన్‌పై కాల్పులు జరపడం కోసం షూటర్లు సుమారు నెల పాటు ముంబైలో మకాం వేసి ఖాన్ ఇంటి చుట్టూ కనీసం మూడుసార్లు పరిశీలన జరిపారు.
అయితే ఖాన్ సినిమా షూటింగ్‌ల కోసం రోజుల తరబడి బయటకు వెళ్లడమో లేదా రోజుల తరబడి ఇంట్లోనే ఉండటంతో వారు తమ దృష్టిని టైగర్ ష్రాఫ్పైకి మళ్లించారు. ష్రాఫ్ ప్రతి ఆదివారం జూహులోని ఒక పార్క్‌లో ఫుట్‌బాల్ ఆడేందుకు వస్తాడని తెలుసుకొని అక్కడ అతడిపై కాల్పులు జరిపేందుకు యత్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

