ముంబై, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వద్ద రైల్వే ఉద్యోగుల నిరసన కారణంగా సెంట్రల్ రైల్వే లైన్లో లోకల్ ట్రైన్ ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా శాండ్హర్ట్స్ రోడ్స్టేషన్ సమీపంలో పట్టాలపై నడుస్తున్న నలుగురు ప్రయాణికులను అంబర్నాథ్ ఫాస్ట్ లోకల్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అకడికకడే మరణించారు. మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి.