Foreign Education | న్యూఢిల్లీ, నవంబర్ 15: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అమెరికా చాలా కాలం నుంచి అత్యంత ప్రధాన గమ్యస్థానంగా కొనసాగుతున్నది. ఏటా ప్రపంచ దేశాల నుంచి అగ్రరాజ్యం అత్యధిక సంఖ్యలో విద్యార్థులను ఆకర్షిస్తున్నది. కానీ, అమెరికాతోపాటు పలు ఇతర దేశాల్లోని విద్యాసంస్థల్లో ఫీజులు ఏటేటా గణనీయంగా పెరుగుతుండటం విదేశీ విద్యార్థులను కలవరపెడుతున్నది. వారు ఎంచుకునే యూనివర్సిటీలు, కోర్సులను బట్టి ఈ ఫీజులు ఆధారపడి ఉంటాయి. ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ యూనివర్సిటీల్లో తక్కువ ఫీజులు వసూలు చేస్తారు. మెడిసిన్, ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి కోర్సుల కంటే హ్యుమానిటీస్, ఎడ్యుకేషన్, ఆర్ట్స్ కోర్సుల ఫీజులు తక్కువ.
కశ్మీర్ అంశంపై చర్చా వేదికను నిర్వహించడాన్ని నిరసిస్తూ యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భారత విద్యార్థులు గురువారం నిరసన ప్రదర్శన చేశారు. చర్చా వేదికను ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వేదిక ప్యానల్లోని కొందరు వ్యక్తులు విద్వేష ప్రసంగీకులని వారు ఆరోపించారు. వారిలో కొంతమందికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతున్నదన్నారు. ఈ సందర్భంగా ఒక వర్గం వారు కశ్మీర్లోని హిందువులను భయపెట్టి వారు ఎలా అక్కడి నుంచి పారిపోయేలా చేశారో విద్యార్థులు వివరించారు.