ఇడుక్కి (కేరళ), జనవరి 30: బాలికపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు కేరళలోని పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 90 ఏండ్ల చొప్పున జైలు శిక్ష ఖరారు చేసింది. బెంగాల్‌కు చెందిన వలస కూలీలు ఇడుక్కి జిల్లాలో పనిచేయడానికి 2022లో వచ్చారు. అప్పుడు ముగ్గురు వ్యక్తులు ఓ వలస కూలీ కుమార్తెపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు తాజాగా శిక్షలు ఖరారు చేసింది.