లండన్: అడవి జంతువులు తమ ఆవాసాల్లో వాటి నిజమైన స్వభావాన్ని చూపుతూ చేసే కొన్ని పనులు చూపరులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా కోతులు, చింపాంజీలు చేసే, ఒరాంగ్ ఉటాన్‌లు జూపార్కుల్లో చేసే చిలిపి చేష్టలు వింతగా ఉంటాయి. ఎలుగుబంట్లు కూడా వింత ప్రవర్తనతో సందర్శకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా లెమ్యూర్ల డ్యాన్సింగ్కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఈ లెమ్యూర్లు దక్షిణ మడగాస్కర్‌లోని దట్టమైన అడవుల్లో నివసిస్తాయి. వీటికి కోతులకు ఉన్నట్లే పొడవైన తోక ఉంటుంది. అయితే శరీరంపై బూడిద, తెలుపు రంగుల కలగలుపుతో కూడిన బొచ్చు ఉంటుంది. వీటి కండ్లు ఎర్రగా, తోక నల్లగా చూడ్డానికి వింతగా ఉంటుంది. ఇవి చేసే చిలిపి చేష్టలు చూస్తే మరంత ముద్దొస్తాయి. ఇవి డ్యాన్స్ కూడా చేస్తాయి. ఈ డ్యాన్స్ చేసే లెమ్యూర్లను సిఫాకా అని కూడా పిలుస్తారు.
లెమ్యూర్లు ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియోను యూకేకు చెందిన చెస్టర్ జూ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కలుసుకోండి మీ కొత్త అభిమాన జంతువు.. ది సిఫాకాను అని ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న రెండు లెమ్యూర్లలో ఒకటి ఆడది, ఇంకోటి మగది ఉన్నాయి. ఆడ లెమ్యూర్ పేరు బీట్రైస్, మగ లెమ్యూర్ పేరు ఇలియట్.
ఈ రెండు లెమ్యూర్లను నార్త్ కరోలినాలోని డ్యూక్ లెమ్యూర్ సెంటర్ నుంచి యూకేకు తరలించారు. మరి ఈ లెమ్యూర్లు చేసే ఫన్నీ డ్యాన్స్ చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం.. పదండి.
Meet your new FAVOURITE animal… the SIFAKA!🐒😍
— Chester Zoo (@chesterzoo) May 27, 2021
These incredibly rare 'dancing' lemurs are the FIRST of their kind to ever be seen in Europe… pic.twitter.com/h1o2A7D1ns