ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం… దసరా రోజున రావణుడికి పూజలు, హారతి
సంగోలా గ్రామస్తులు శ్రీరాముడ్ని కూడా ఆరాధిస్తారు. అయితే రాక్షస రాజైన రావణాసురుడ్ని కూడా అంతగా నమ్ముతారు. ఎంతో తెలివి, తపస్వీ వంటి గుణాలున్న రావణుడి విగ్రహానికి దసరా రోజున భారీగా హారతి ఇస్తారు. దీనిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో ఈ గ్రామానికి వస్తారు.
ముంబై: చెడుపై మంచికి విజయంగా జరుపుకునే దసరా రోజున దేశ వ్యాప్తంగా రావణుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. అయితే మహారాష్ట్రలోని ఒక గ్రామం మాత్రం ఎంతో ప్రత్యేకం. దసరా రోజున రావణాసురుడి విగ్రహానికి హారతి ఇచ్చి పూజలు చేశారు. రావణుడి ఆశీర్వాదం వల్లనే తమ గ్రాస్తులు ఉపాధి పొందుతున్నారని, గ్రామంలో శాంతి, సంతోషాలు నెలకొంటున్నాయని వారు నమ్ముతున్నారు. అకోలా జిల్లాలోని సంగోలా గ్రామంలో ఈ వింత ఆచారం ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతున్నది. ఆ గ్రామం మధ్యలో రాక్షస రాజైన రావణాసురుడి పది తలలతో కూడిన ఎత్తైన విగ్రహం ఉంది. సంగోలా గ్రామస్తులు దసరా రోజున ఈ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేయడంతోపాటు మహా హారతి ఇస్తారు. రావణుడి ఆశీర్వాదం కారణంగా గ్రామస్తులు ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నారని, గ్రామంలో శాంతి, సంతోషాలు వర్ధిల్లుతున్నాయని నమ్ముతున్నారు.

కాగా, సంగోలా గ్రామస్తులు శ్రీరాముడ్ని కూడా ఆరాధిస్తారు. అయితే రాక్షస రాజైన రావణాసురుడ్ని కూడా అంతగా నమ్ముతారు. ఎంతో తెలివి, తపస్వీ వంటి గుణాలున్న రావణుడి విగ్రహానికి దసరా రోజున భారీగా హారతి ఇస్తారు. దీనిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో ఈ గ్రామానికి వస్తారు. దసరా రోజున దేశ వ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తే ఈ గ్రామంలో మాత్రం రావణుడి విగ్రహానికి పూజలు చేయడంతోపాటు హారతి ఇస్తారని ఆ ఆలయ పూజారి, స్థానికులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

