PPE Kits | పీపీఈ కిట్స్ ధరించి మొబైల్ షాపులోకి చొరబడిన దొంగలు.. వంద ఫోన్లు చోరీ
PPE Kits | పీపీఈ కిట్స్ (PPE Kits) ధరించిన దొంగలు ఒక మొబైల్ షాపులోకి చొరబడ్డారు. ఖరీదైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. మొబైల్ షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో: పీపీఈ కిట్స్ (PPE Kits) ధరించిన దొంగలు ఒక మొబైల్ షాపులోకి చొరబడ్డారు. ఖరీదైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. మొబైల్ షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి గంగా నగర్ ప్రాంతంలోని మొబైల్ షాపులో చోరీ జరిగింది. పీపీఈ కిట్స్ ధరించిన దొంగలు ఖాళీగా ఉన్న ఒక ఫ్లాట్ నుంచి పక్కనే ఉన్న మొబైల్ షోరూమ్‌కు రంధ్రం చేసి అందులోకి ప్రవేశించారు. సుమారు రూ.60 లక్షల విలువైన వంద మొబైల్ ఫోన్లు చోరీ చేశారు.
కాగా, గురువారం ఉదయం షాపు తెరిచిన ఓనర్ మొబైల్ ఫోన్లు చోరీ జరిగినట్లు గ్రహించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ మొబైల్ షోరూమ్ వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. గుర్తించకుండా ఉండేందుకు దొంగలు పీపీఈ కిట్లు ధరించి ఆ షాపులోకి చొరబడి ఖరీదైన మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు గ్రహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

