లక్నో: ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఒక దొంగ చాలా ఈజీగా చోరీ చేశాడు. కేవలం 15 సెకండ్లలో లాక్ తీసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. (Royal Enfield Bike Theft) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం ఒకచోట పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. చాలా సునాయసంగా కొన్ని సెకన్లలో ఇనుప వస్తువుతో బైక్ లాక్ తీశాడు. దానిని డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, సుమారు రూ.2.25 లక్షల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మాయం కావడంతో దాని యజమాని షాక్ అయ్యాడు. బైక్ చోరీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను చోరీ చేసిన వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను దొంగ చాలా ఈజీగా చోరీ చేయడం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ బైక్ లాకింగ్ సెక్యూరిటీ పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా ఇలాగే చోరీ అయ్యిందని ఒకరు ఆరోపించారు.
चोर आया, लोहे की नुकीली कील जैसी चीज लॉक में घुसाई, लॉक तोड़ा, बैठा और बुलेट मोटरसाइकिल लेकर भाग निकला। ये सब सिर्फ 15 सेकेंड में हुआ। दो, ढाई, तीन लाख रुपए की बाइक में क्या यही सिक्योरिटी सिस्टम है?
📍जिला मुजफ्फरनगर, उत्तर प्रदेश pic.twitter.com/BOi4wiNbIY— Sachin Gupta (@SachinGuptaUP) April 7, 2025