ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల లేదా ఒక పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌లో ఇవాళ నాలుగు వైద్య కళాశాలకు మోదీ శంకుస్థాపన చేశారు. బన్స్వారా, సిరోహి, హనుమాన్‌ఘర్, దౌసా జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణా చర్యలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. జైపూర్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ కాలేజీకి కూడా మోదీ శంకుస్థాపన చేశారు.
ఇటీవల ఆయుష్మాన్ భారత్ డిజిటిల్ మిషన్ ఆరోగ్య సేవలను ప్రారంభించామని, ఆ సేవలను దేశమంతా విస్తరించామన్నారు. హాస్పిటళ్లు, ల్యాబ్‌లు, ఫార్మసీలన్నింటినీ ఒక క్లిక్‌తో విజిట్ చేయవచ్చు అని తెలిపారు. డిజిటల్ హెల్త్ మిషన్‌తో రోగుల మెడికల్ డాక్యుమెంట్లు సురక్షితంగా ఉంచవచ్చు అని ప్రధాని తెలిపారు. దేశంలోని ఆరోగ్య రంగాన్ని మార్చేందుకు జాతీయ ఆరోగ్య విధానాన్ని అవలంబిస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు ఆరోగ్య రంగ అవసరాలను గుర్తు చేసిందన్నారు. ప్రతి దేశం ఆ సంక్షోభాన్ని తమదైన రీతిలో ఎదుర్కొన్నట్లు చెప్పారు. మహమ్మారి వేళ భారత తన శక్తిని, ఆత్మరక్షణను పెంచుకుందన్నారు.
సీఎం గెహ్లాట్‌ను మెచ్చుకున్న మోదీ
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తనపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. ఇద్దరమూ భిన్నమైన పార్టీలకు చెందినవాళ్లమని, ఐడియాలజీలు భిన్నమైనవని, కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న శక్తి ఇదే అని మోదీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం గెహ్లాట్ కోరిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రకంగా రియాక్ట్ అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

