Vote | యువతా ఓటేయవా?.. ఓటు నమోదుకు ఆసక్తి చూపని దేశ యువత
మన తలరాతను మార్చే నాయకులను ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. 18 ఏండ్లు దాటిన పౌరులకు ఓటు ఒక హక్కు. అయితే, మన దేశంలో ఓటు వేసే వయసు వచ్చినప్పటికీ ఓటు హక్కు పొందడానికి మాత్రం యువత అంతగా ఆసక్తి చూపించడం లేదు.
- 18, 19 ఏండ్ల వారిలో నమోదు చేసుకున్నది 38 శాతమే
- తెలంగాణలోనే అత్యధికంగా 67 శాతం నమోదు
Vote | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: మన తలరాతను మార్చే నాయకులను ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. 18 ఏండ్లు దాటిన పౌరులకు ఓటు ఒక హక్కు. అయితే, మన దేశంలో ఓటు వేసే వయసు వచ్చినప్పటికీ ఓటు హక్కు పొందడానికి మాత్రం యువత అంతగా ఆసక్తి చూపించడం లేదు. మన దేశంలో ప్రస్తుతం 18, 19 ఏండ్ల వయసు ఉన్న యువత 4.9 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ ఓటరుగా నమోదు చేసే వయసు వచ్చినప్పటికీ కేవలం 1.8 కోట్ల మంది మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. అంటే, ఓటేసే వయసు వచ్చినప్పటికీ కేవలం 38 శాతం మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. మన దేశంలో 1988 వరకు ఓటు వేయాలంటే కనీస వయసు 21 ఏండ్లు ఉండేది. కానీ, చట్టసభల సభ్యులను ఎన్నుకోవడంలో యువతను భాగం చేయాలనే ఆలోచనతో 1988లో రాజ్యాంగ సవరణ చేసి మరీ ఓటు హక్కు వయసును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించారు. కానీ, ఈ అవకాశాన్ని మాత్రం యువత ఉపయోగించుకోవడం లేదనేది తాజా లెక్కలను బట్టి తెలుస్తున్నది.
నమోదులో తెలంగాణనే టాప్
దేశంలో 18, 19 ఏండ్ల యువత ఎక్కువగా ఓటర్లుగా నమోదైన రాష్ర్టాల్లో తెలంగాణనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 18, 19 ఏండ్ల వయసు వారు 12 లక్షల మంది ఉండగా దాదాపు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అంటే 66.7 శాతం తెలంగాణ యువత ఓటును హక్కుగా పొందారు. తర్వాత జమ్ము కశ్మీర్లో 62 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 60 శాతం మంది 18,19 ఏండ్ల వయసు యువత ఓటరు జాబితాలో చేరారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో కేవలం 23 శాతం, మహారాష్ట్రలో 27 శాతం మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. అత్యల్పంగా బీహార్‌లో ఓటు హక్కు వయసు వచ్చినా నమోదు చేసుకున్నది కేవలం 17 శాతం మంది మాత్రమే. బీహార్‌లో 18, 19 ఏండ్ల వయసు వారు 54 లక్షల మంది ఉంటే కేవలం 9.3 లక్షల మంది మాత్రమే ఓటరు జాబితాలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కేవలం 21 శాతం మందే నమోదు చేసుకున్నారు.
అతి తక్కువ మంది యువత ఓటర్లుగా నమోదైన రాష్ర్టాలు

ఎక్కువ మంది యువత ఓటర్లుగా నమోదైన రాష్ర్టాలు

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

