Kutta became dutta | కథ సుఖాంతమైంది.. కుత్తా కాస్తా దత్తాగా మారింది..
Kutta became dutta | రేషన్‌కార్డులో తప్పుగా ముద్రించిన పేరును మార్చడంతో కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. కుత్తా కాస్తా ఇప్పుడు దత్తాగా మారడంతో శ్రీకాంతికుమార్ దత్తా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kutta became dutta | రేషన్ కార్డులో నమోదైన తప్పును సరిదిద్దడంతో కుక్కలా అరుస్తూ నిరసన తెలిపిన వ్యక్తి కథ సుఖాంతమైంది. ఇప్పుడు కుత్తా కాస్తా దత్తాగా మారింది. దాంతో శ్రీకాంతి కుమార్ దత్తా అధికారులను అభినందించడమే కాకుండా తనను ఫేమ్ చేసిన సోషల్ మీడియాకు కృతజ్ఞతలు చెప్తున్నాడు.
పశ్చిమ బెంగాల్ బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దత్తా అనే వ్యక్తి అధికారుల వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. రేషన్‌కార్డులో తన పేరును దత్తా అని కాకుండా కుత్తా అని ప్రింట్ చేశారని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో కారు వెంట పరిగెడుతూ బౌ బౌ అంటూ కుక్కలా అరిచాడు. ఇది గమనించిన జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కారును ఆపడంతో తన బాధను వెళ్లగక్కాడు. శ్రీకాంతి కుమార్ దత్తా పేరును కాస్తా కుత్తాగా మార్చారని ఆయన దృష్టికితేవడంతో సోమవారం అధికారులు ఆయన కార్డుపై తప్పును సరిదిద్ది ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. కుత్తా కాస్తా దత్తాగా మారిందంటూ తనకు తానుగా సెటైర్లు విసురుకున్నాడు.
राशन कार्ड में Dutta की जगह लिखा 'Kutta' तो भड़का शख्स, अधिकारी के सामने लगा भौंकने|
– मामला बंगाल का है। pic.twitter.com/miuGZ4GV0F
— Shubhankar Mishra (@shubhankrmishra) November 19, 2022
రెండు రోజుల క్రితం బంకురా నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు సార్లు అధికారులకు విన్నవించినా స్పందించలేదని, కానీ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ కాగానే స్పందించిన అధికారులు తన పేరును మార్చి ఇచ్చారని దత్తా చెప్పారు. దాంతో సమస్య పరిష్కారం అయినందుకు సోషల్ మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

