శ్రీనగర్ : ‘హర హర మహాదేవ’, బం బం భోలే’ అనే భక్తుల నినాదాలతో కశ్మీర్‌లోని మంచుకొండలు పులకించాయి. హిమగిరుల్లో మంచు శిలా రూపంలో కొలువైన శివుడి దర్శనానికి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది.
మొదటి బ్యాచ్‌కు చెందిన 6 వేల మంది భక్తుల యాత్రను గండేర్బల్ కమిషనర్ శ్యాంబీర్, ఇతర అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి శనివారం రెండో బ్యాచ్‌గా 4,400 మంది ప్రయాణికులు బయలుదేరారు. మరోవైపు భక్తులకు ఉగ్రవాద ముప్పు ఉండటంతో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.